NTV Telugu Site icon

Automatic Payment Limit: వారికి శుభవార్త.. లిమిట్ పెంచిన ఆర్బీఐ..

Upi

Upi

Automatic Payment Limit: మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది ఆర్బీఐ.. ఎన్పీసీఐ చెల్లింపుల కోసం యూపీఐ ఆటోపే సౌకర్యాన్ని అందించింది. ఈ కొత్త ఫీచర్‌తో, కస్టమర్‌లు ఇప్పుడు మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లు ఇలా మొదలైన నెలవారి చెల్లింపుల కోసం ఏదైనా యూపీఐ అప్లికేషన్‌ని ఉపయోగించి చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.

Read Also: Joe Biden: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జో బిడెన్ రాకపోవడానికి కారణం అదేనా?

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ చెల్లింపుల పరిమితిని కొన్ని వర్గాలకు ప్రతి లావాదేవీకి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా దీని పరిధిలోకి వస్తాయి.. ప్రస్తుతానికి, రూ. 15,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం కార్డ్‌లు, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై సూచనలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఐ)లో సడలింపు అనుమతించబడుతుంది. మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం సింగిల్ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.15,000 నుంచి రూ.1,00,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ రికరింగ్ లావాదేవీల కోసం ఈ-సూచనల అమలుపై జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. . ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. గత వారం ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ లావాదేవీల పరిమితిని రూ.15,000 నుండి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.