Automatic Payment Limit: వారికి శుభవార్త.. లిమిట్ పెంచిన ఆర్బీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Automatic Payment Limit: మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది ఆర్బీఐ.. ఎన్పీసీఐ చెల్లింపుల కోసం యూపీఐ ఆటోపే సౌకర్యాన్ని అందించింది. ఈ కొత్త ఫీచర్‌తో, కస్టమర్లు ఇప్పుడు మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, బీమా, మ్యూచువల్ ఫండ్లు ఇలా మొదలైన నెలవారి చెల్లింపుల కోసం ఏదైనా యూపీఐ అప్లికేషన్ని ఉపయోగించి చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.
Read Also: Joe Biden: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జో బిడెన్ రాకపోవడానికి కారణం అదేనా?
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ చెల్లింపుల పరిమితిని కొన్ని వర్గాలకు ప్రతి లావాదేవీకి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా దీని పరిధిలోకి వస్తాయి.. ప్రస్తుతానికి, రూ. 15,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం కార్డ్‌లు, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై సూచనలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఐ)లో సడలింపు అనుమతించబడుతుంది. మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం సింగిల్ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.15,000 నుంచి రూ.1,00,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ రికరింగ్ లావాదేవీల కోసం ఈ-సూచనల అమలుపై జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. . ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. గత వారం ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సందర్భంగా యూపీఐ ద్వారా ఆటోమేటెడ్ లావాదేవీల పరిమితిని రూ.15,000 నుండి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!