Sasi Madhanam : ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా ఓటీటీ ప్రభంజనం ఎక్కువగా నడుస్తుంది. సినిమాలకు వెళ్లి చూడలేని చాలామంది సినిమాలు ఓటీటీలోకి వచ్చాక చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కూడా అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లి చూసేదానికంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయడం ఎక్కువైపోయింది. ఓటీటీలో కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా నటీనటులు మెప్పిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్ కామెడీ కంటెంట్ లను ఎక్కువగా చూడడానికి సినిమా లవర్స్ ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్ లాంటి సినిమాలు ఎక్కువగా సినిమా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు మంచి సక్సెస్ ను కూడా అందుకుంటున్నాయి. ఇకపోతే తాజాగా తెలుగు నుండి ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.
Deputy CM Pawan Kalyan: కాకినాడ జిల్లాలో రెండోరోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
జూలై 4 నుండి ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. బుల్లితెరపై తనదైన పంచులతో ఫ్యాన్స్ ఇమేజ్ ను పెంచుకున్నసోనియా సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఆమెతోపాటు పవన్ సిద్ధూ, రూప లక్ష్మి, కీర్తి లాంటి నటీనటులు ప్రత్యేక పాత్రలలో నటించారు. ఆ వెబ్ సిరీస్ ఏదో కాదు.. ” శశి మదనం “. ఈటీవీ విన్ లో ఈ సిరీస్ జులై 4 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. కేవలం టీజర్ చూస్తే చాలు.. వెబ్ సిరీస్ లో ఏ మోతాదులో కామెడీ పండిందో అర్థమవుతుంది. టీజర్ ఆధ్యాంతం మొత్తం నవ్వులు పూయించింది. ” దాగుడుమూతలు దండాకోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్చుప్ ” అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ గురించి తెలిపారు మూవీ మేకర్స్.
Laila : ” లైలా ” మొదలెడుతున్న విశ్వక్ సేన్..