Pat Cummins did what he said ahead of IND vs AUS Final 2023: భారత గడ్డపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. ఆరోసారి వన్డే క్రికెట్‌లో జగజ్జేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ఆరంభ దశలో తడబడి.. ఆ తర్వాత కోలుకున్న ఆసీస్ ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు సెమీస్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియాను ఓడించి.. వన్డే క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యం చెలాయించింది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో సత్తాచాటి.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ప్యాట్ కమిన్స్ అద్భుత సారథ్యం ఆసీస్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది.
ప్యాట్ కమిన్స్ సారథ్యంపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే భారత అభిమానులకు మాత్రం విలన్‌లా మారాడు. ఇందుకు కారణం లేకపోలేదు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కమిన్స్ మాట్లాడుతూ.. ఆదివారం రోజున నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం బ్లూ మయం అయిపోతుందని, భారత జట్టుకు మద్దతుగా భారీగా ఫాన్స్ వస్తారన్నాడు. మైదానంలో 1.3 లక్షల భారత అభిమానులను సైలెంట్‌గా ఉంచడం కంటే సంతృప్తికరమైంది ఏమీ లేదు అన్నాడు. ఫైనల్లో భారత అభిమానులను నిశ్శబ్దంగా ఉంచడమే తన లక్ష్యం అని చెప్పాడు.
Also Read: Virat Kohli: ప్రపంచకప్ ట్రోఫీ రాకపోయినా.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ మనోడికే దక్కింది!
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పినట్టే చేశాడు. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు మాత్రమే భారత అభిమానుల్లో నవ్వు ఉంది. ఆపై వరుస వికెట్స్ కోల్పోవడం, భారత్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడడంతో అభిమానుల్లో జోష్ తగ్గింది. ఇక ఆస్ట్రేలియా మూడు వికెట్స్ కోల్పోయినప్పుడు సందడి చేసిన ఫాన్స్.. ఆపై సైలెంట్ అయ్యారు. ఇన్నింగ్స్ చివరలో అయితే కొందరు ఏడ్చేశారు కూడా. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆడు మగాడ్రా బుజ్జి, ప్యాట్ కమిన్స్ అన్నంత పని చేశాడు అని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.