AUS vs IND: హ్యాట్రిక్ కొట్టనివ్వం.. టీమిండియాను నిశ్శబ్దంగా ఉంచుతాం: కమిన్స్
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- టీమిండియాను హ్యాట్రిక్ కొట్టనివ్వం
- రిషబ్ పంత్ డేంజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి మరీ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సవాలే చేశాడు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్ కమిన్స్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం మేం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటివరకు అంతా సాఫీగా సాగుతోంది. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకుంటాం. సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. గత రెండుసార్లు భారత్ ట్రోఫీ గెలవడంతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మా జట్టులోని కొన్ని స్థానాలపై చర్చ సాగుతోంది. డేవిడ్ వార్నర్‌ను ఎవరితో భర్తీ చేయాలో చూడాలి. మా ఆటగాళ్ల విషయంలో స్పష్టతతో ఉన్నాం. కామెరూన్ గ్రీన్ లేకపోవడం మాత్రం మాకు కాస్త ఇబ్బందే’ అని కమిన్స్ తెలిపాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: AUS vs IND: అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా! ఇలా అయితే కష్టమే
‘మమ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం భారత్‌కు పెద్ద లోటే. క్రికెట్లో ఇలాంటివి సర్వసాధారణమే. ఒకరి స్థానంలో మరొక ప్లేయర్ సిద్ధంగా ఉంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్‌లో లేరు. కానీ వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే మేం దృష్టిసారించాం. రిషబ్ పంత్ డేంజర్ అని గతంలోనే చెప్పా. మరోసారి అదే చెబుతున్నా. ఆస్ట్రేలియా అంటే అతడు ఊగిపోతాడు. ఈసారి మాత్రం పంత్‌కు చెక్ పెడతాం. భారత ప్లేయర్స్ పేస్ పిచ్‌లపై బాగా ఆడుతున్నారు. పెర్త్, అడిలైడ్‌లో వారిని నిలువరిస్తామని అనుకుంటున్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకోవడంపై ఇప్పుడే దృష్టి సారించడం లేదు’ అని కమిన్స్ చెప్ప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!