క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. ఆసీస్ విజయ లక్ష్యం 168 రన్స్. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (28), శివమ్ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20), అక్షర్ పటేల్ (21) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా తలో మూడు వికెట్స్ పడగొట్టారు.
Also Read: Rashmika Mandanna: ‘రౌడీ’ జిమ్ త్వరలో ప్రారంభిస్తా.. నేనే ట్రైనర్, వచ్చేయండి!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ కలిసి 56 పరుగులు చేశారు. ఆపై శివమ్ దూబేతో కలిసి గిల్ కొన్ని కీలక రన్స్ చేశాడు. ఈ సమయంలో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (12) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. తిలక్ వర్మ (5), జితేశ్ శర్మ (3) నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరలో అక్షర్ పటేల్ (21) వేగంగా పరుగులు చేశాడు.