Site icon NTV Telugu

AUS vs IND: చెలరేగిన బౌలర్లు.. నాలుగో టీ20లో భారత్ భారీ విజయం!

AUS vs IND 4th T20

AUS vs IND 4th T20

ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Also Read: Ponnam Prabhakar: ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్!

మోస్తరు ఛేదనలో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభమే దక్కింది. మిచెల్ మార్ష్‌, మ్యాథ్యూ షార్ట్‌లు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని శివమ్ దూబే విడదీశాడు. జోష్ ఇంగ్లిష్ (12) వికెట్ అనంతరం ఆసీస్ వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది. టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), గ్లెన్ మాక్స్‌వెల్ (2), మార్కస్ స్టోయినిస్ (17) వికెట్స్ పడడంతో ఆసీస్ ఖాయమైంది. బౌలర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. శుభ్‌మన్‌ గిల్ (46) టాప్ స్కోరర్. అభిషేక్‌ శర్మ (28), శివమ్‌ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20), అక్షర్‌ పటేల్ (21) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్ ఎలిస్‌, ఆడమ్ జంపా తలో 3 వికెట్స్ పడగొట్టారు.

Exit mobile version