AUS vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్.. విరాట్ కోహ్లీ దోస్త్ వచ్చేశాడు! సెమీస్ బెర్త్ ఎవరిదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan have won the toss and have opted to bat vs Australia: ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలని చూస్తున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ సారథి హష్మతుల్లా షాహిది బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. ఫజల్హక్ స్థానంలో విరాట్ కోహ్లీ దోస్త్ నవీన్ ఉల్ హక్ ఆడుతున్నాడు. ఐపీఎల్ సందర్భంగా గొడవ పడిన నవీన్, కోహ్లీ.. ప్రపంచకప్ 2023లో దోస్తులు అయ్యారు.
మరోవైపు ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టీవ్ స్టీవ్, కామెరూన్ గ్రీన్ స్థానాల్లో గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ మార్ష్ వచ్చారు. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలనుకుంటున్న ఆసీస్.. మెగా టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గాన్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇక ఆస్ట్రేలియాపై గెలిస్తే అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తుది జట్లు:
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్.
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
తాజావార్తలు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!