NTV Telugu Site icon

Vizag Crime: అల్లుడి హత్యకు దారి తీసిన అత్త అక్రమ సంబంధం..!

Crime

Crime

Vizag Crime: విశాఖపట్నంలోని అగనంపూడిలో దారుణం జరిగింది. ఈ నెల 8న రాత్రి 10 గంటల సమయంలో ఓ హత్య జరిగింది. సూర్య కిరణ్‌ అనే యువకుడిని కత్తితో పొడిచి చంపారు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దువ్వాడ పోలీసులు… సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలించారు. హంతకుడు దొరికాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా కొరయ్య అనే వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించారు పోలీసులు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు కొరయ్య. కాకపోతే ఇదంతా శిరీష చెబితేనే చేశానన్నాడు. శిరీష ఎవరు..? ఆమె సూర్య కిరణ్‌ను ఎందుకు చంపించింది..?

Read Also: Rana Daggubati : బాహుబలి బ్యానర్లో రానా కొత్త సినిమా.. కానీ?

సూర్య కిరణ్‌ క్యాబ్‌ డ్రైవర్‌. అతడు ప్రమోద మేఘన అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను మేఘన తల్లి శిరీష ఒప్పుకోలేదు. దాంతో అన్నవరం వెళ్లి సూర్య కిరణ్‌, ప్రమోద మేఘన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అంతా సెట్‌ అయినట్టే అనిపించింది. మేఘన తండ్రి గతంలోనే చనిపోయాడు. ఆమె తల్లి శిరీష… కొరయ్య అనే వ్యక్తితో కలసి ఉండేది. కొరయ్య అంటే సూర్య కిరణ్‌కు అస్సలు పడేదికాదు. చాలా ఏళ్లుగా శిరీష, కొరయ్య మధ్య వివాహేతర సంబంధం ఉంది. అత్త వ్యవహారం నచ్చని సూర్యకిరణ్‌… ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈలోపు మేఘనకు డెలివరీ టైమ్‌ వచ్చింది. ఆమె హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయింది. రెండు రోజుల క్రితమే పాప పుట్టింది. అల్లుడు అంటే ఇష్టంలేకపోయినా… కూతురిని, మనుమరాలిని చూడటానికి అగనంపూడిలోని హాస్పిటల్‌కు వెళ్లింది శిరీష.

Read Also: Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరణ

హాస్పిటల్‌కు వచ్చిన శిరీషతో గొడవపడ్డాడు అల్లుడు సూర్యకిరణ్‌. కోపంలో శిరీషపై చేయి కూడా చేసుకున్నాడు. తనను కొట్టాడని అల్లుడిపై కక్ష పెంచుకుంది అత్త. ఇంటికి వెళ్లి తన ప్రియుడు కొరయ్యతో విషయం చెప్పింది. ఈ గొడవలన్నీ ఆగాలంటే… సూర్యకిరణ్‌ను చంపేయాలని కొరయ్యను రెచ్చగొట్టింది. శిరీష చెప్పడంతో సూర్య కిరణ్‌ను చంపేందుకు కత్తి తీసుకుని బయల్దేరాడు కోరయ్య. అగనంపూడి హాస్పిటల్‌కు 100 మీటర్ల దూరంలో కాపు కాశాడు. రాత్రి 10 గంటల 15 నిమిషాల సమయంలో హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చాడు సూర్యకిరణ్‌. వెంటనే అతడిపై కత్తితో దాడి చేశాడు. ఛాతిలో కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో సూర్య కిరణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత జరిగిన విషయం శిరీషకు చెప్పాడు కొరయ్య.

Read Also: Off The Record: చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? రేవంత్ రెడ్డి ఏపీని టార్గెట్ చేస్తారా..?

స్థానికుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు… ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. శిరీష, కొరయ్యలను అరెస్ట్‌ చేశారు పోలీసులు. హాస్పిటల్‌లో ఉన్న మేఘన స్టేట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు పోలీసులు. మేఘన మాత్రం తల్లికే వంతపాడింది. సూర్యకిరణ్‌ది రూడ్‌ బిహేవియర్‌ అని, డబ్బు మనిషి అంటూ ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసులో ఇంకా అనేక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.