Demat Accounts: 19 నెలల్లో 31 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. ఇప్పటికి మొత్తం 12.66 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demat Accounts: భారత స్టాక్ మార్కెట్ ఆగస్ట్ నెలలో నిస్తేజాన్ని చూసింది. అయితే మిడ్ క్యాప్, స్మాల్ స్టాక్స్ ఇండెక్స్ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత మార్కెట్ బూమ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధమయ్యారు. ఫలితంగా ఆగస్టు 2023లో గత 19 నెలల్లో గరిష్టంగా డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఇప్పుడు 12.66 కోట్లు దాటింది.
CDSL,NSDL నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆగస్టు 2023లో మొత్తం 31 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. ఇది జనవరి 2022కంటే అత్యధికం. జూలై 2022లో మొత్తం 29.7 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. ఒక సంవత్సరం క్రితం ఆగస్టు 2022లో మొత్తం 21 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి.
Also Read
Read Also:Health Tips : రోజూ ఉదయం టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ తీసుకుంటే చాలు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఇప్పుడు 12.66 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఆగస్టు 2022 కంటే 25.83 శాతం ఎక్కువ. మార్చి 2020లో స్టాక్ మార్కెట్లో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4 కోట్ల కంటే తక్కువగా ఉంది. అయితే ఆ తర్వాత భారత స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకున్న తర్వాత రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీని ఫలితంగా 3 సంవత్సరాలలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 3 రెట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ బూమ్ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి భారత మార్కెట్ వృద్ధికి క్రెడిట్ ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లకే దక్కుతోంది.
స్టాక్ మార్కెట్‌లో ఏకపక్ష పెరుగుదల మార్చి 2023 నుండి కొనసాగుతోంది. సెన్సెక్స్ 8500 పాయింట్లు, నిఫ్టీ 2800 పాయింట్లు ఎగబాకాయి. ఆ సమయంలో బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.255 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.321 లక్షల కోట్లకు చేరింది. అంటే 5 నెలల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.65 లక్షల కోట్లు పెరిగింది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరుగుతున్నా, ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ప్రతి నెలా రూ.15,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు.
Read Also:Saturday Pooja : అప్పుల భాధల నుంచి బయటపడాలంటే శనివారం ఈ పని చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు