NTV Telugu Site icon

UP: షాపింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నం.. వీడియో వైరల్

Gang Rape

Gang Rape

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు హడావుడిగా కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. సమాచారం ప్రకారం.. ఈ సంఘటన మంగళవారం రాత్రి రావత్‌పూర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక మహిళ షాపింగ్ తర్వాత సాల్ట్ ఫ్యాక్టరీ కూడలికి చేరుకుంది. ఆ సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేరు. మహిళను ఒంటరిగా ఉండటం గమనించిన ఓ యువకుడు మార్గంమధ్యలో ఆమెను కింద పడేసి అత్యాచారానికి యత్నించాడు. మహిళ గట్టిగా అరుస్తూ.. నిందితుడిని తోసేసింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో భయపడిన బాధితురాలు కూడా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లింది.

READ MORE: Char Dham Yatra: చార్‌ధామ్‌ యాత్రలో భక్తుల రద్దీ.. ఈనెల31 వరకు వీఐపీ దర్శనాలు బంద్‌

ఈ ఘటన అంతా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ వీడియో ఆధారంగా రావత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతి షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ యువకుడు ఆమెను రోడ్డుపై వేధించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు యువకుడు మద్యం తాగి ఉండొచ్చని తెలుస్తోంది. అతి త్వరలో అతన్ని పట్టుకుంటామని తెలిపారు.