సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు. రాత్రికి రాత్రే 200 మందికి పైగా దుండగులు ప్రైవేటు భూమి వద్దకు చేరుకున్నారు. కంటైనర్, నేమ్ బోర్డులు, రేలింగ్ పైపులతో డీసీఎం, ట్రాలీ ఆటోల్లో అర్థరాత్రి వేళ వచ్చి హల్ చల్ చేశారు. జేసీబీల సహాయంతో ప్రహరీ గోడలను తొలగించి రేలింగ్ పైపులను పాతిన వైనం. దుండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలేసి వచ్చారు.
Also Read:రూ. 10 వేలకే శాంసంగ్ నుంచి మరో ఫోన్.. 8GB RAM, 6,000mAh బ్యాటరీతో Galaxy M17e
మరో వాచ్ మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. జి. మాదవి w/o భగవంత్ రెడ్డి కి చెందిన సర్వే నంబర్ 192/ఆ9/అ లోని 5.12 గుంటల భూమి, చదలవాడ శ్రీనివాస్ కు చెందిన , 4 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారుల గుర్తించారు. వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్ వైజర్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రికి రాత్రే దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు.