Samsung Galaxy M17e: 2026లో గ్లోబల్ మార్కెట్లను టార్గెట్ చేస్తూ శాంసంగ్ మరో కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Galaxy M17eపై పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ డివైస్ గూగుల్ పే కన్సోల్ సపోర్ట్ డివైస్ లిస్టింగ్‌లో కనిపించింది. ఇందులో ఫోన్ మోడల్ నంబర్ SM-M076B (SM-M076B)గా, అలాగే, కోడ్ నేమ్ “A07x”గా నమోదైంది. ఇది త్వరలో లాంచ్ కానున్న Galaxy A07 5G ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది.
Read Also: Tara Sutaria-Veer Pahariya: బ్రేక్‌అప్.. విడిపోయిన స్టార్ సెలబ్రిటీ ప్రేమ జంట!
పేరులో మార్పు వెనుక వ్యూహం?
మొదట్లో శాంసంగ్ డివైస్ మోడల్ నంబర్ ప్యాటర్న్ ప్రకారం దీనిని Galaxy M07 5Gగా లాంచ్ చేస్తారని అందరూ అంచనా వేశారు. కానీ గూగుల్ పే కన్సోల్ లిస్టింగ్‌లో మాత్రం స్పష్టంగా Galaxy M17e 5G పేరుతో కనిపించడం గమనార్హం. “e” సఫిక్స్‌ను సాధారణంగా అత్యంత తక్కువ బడ్జెట్ ఫోన్లకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు శామ్‌సంగ్ ఈ నేమింగ్‌ను Galaxy A0Xe, అలాగే వాటి రీబ్రాండెడ్ M0Xe, F0Xe సిరీస్‌లకు మాత్రమే ఎక్కువగా ఉపయోగించింది. కానీ, Galaxy M1X లైనప్‌లో “e” సఫిక్స్ వాడటం చాలా అరుదు అని చెప్పాలి.. అందుకే ఈ పేరు ఎంపిక టెక్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా, ఇటీవల మార్కెట్లో అనేక మొబైల్ కంపెనీలు తమ నేమింగ్ వ్యూహాలను మార్చుకుంటున్న నేపథ్యంలో, శామ్‌సంగ్ కూడా అదే బాటలో కొత్త బ్రాండింగ్ ప్రయోగాలు చేస్తుండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Galaxy M17e 5Gలో ఫీచర్లు?
ప్రాసెసర్:
* MediaTek Dimensity 6300 చిప్‌సెట్
* ర్యామ్: 8GB
* OS: Android 16 ఆధారిత One UI 8
బ్యాటరీ:
* 6,000mAh
డిస్‌ప్లే:
* 6.7 – 6.8 అంగుళాల క్లాస్ స్క్రీన్
కేటగిరీ:
* గేమింగ్ కంటే పర్‌ఫార్మెన్స్ + డే-టు-డే 5G యూజర్లకు అనువైన బడ్జెట్ మోడల్
* Galaxy A07 5Gతో లింక్
ఇదే సమయంలో Galaxy A07 5G కూడా గూగుల్ పే కన్సోల్ లో దర్శనమిచ్చింది. ఆ లిస్టింగ్‌లో కూడా Dimensity 6300, 8GB RAM, 6,000mAh బ్యాటరీ, Android 16 (One UI 8) వంటి ఫీచర్లు ఉండనున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల Galaxy M17e 5G, A07 5G ఫోన్‌కు రీబ్రాండింగ్ మాత్రమే అయ్యే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది. కానీ, ఈ ఫోన్‌కు సంబంధించి Galaxy F07 5G లేదా F17e 5G లాంచ్‌పై ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు