NTV Telugu Site icon

Physical Harassment: ఆగ్రాలో దారుణం.. హోటల్‌లో పనిచేసే మహిళపై సామూహిక అత్యాచారం

Harrasment

Harrasment

Physical Harassment: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పనిచేసే మహిళ ఉద్యోగిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్థరాత్రి ఆ మహిళ నుంచి తమకు కాల్ వచ్చిందని, వెంటనే సంఘటన స్థలానిక చేరుకుని బాధిత మహిళను కాపాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read Also: West Bengal: టీఎంసీ నాయకుడు దారుణ హత్య.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.. తాగిన మైకంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. అంతేకాకుండా.. తనను బలవంతంగా గదిలో బంధించి దారుణంగా కొట్టారని మహిళ పోలీసులకు తెలిపింది. నిందితులు బలవంతంగా మద్యం తాగించారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మహిళ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. బాధితురాలు హోటల్ లో పనిచేసే ఉద్యోగి అని పోలీసులు చెప్పారు. ఘటనకు పాల్పడిన సమయంలో బాధితురాలిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు ఓ వీడియో కూడా బయటపడింది.

Read Also: Virat Kohli: నెదర్లాండ్స్ క్రికెటర్కు కోహ్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్చన సింగ్ తెలిపారు.

Show comments