NTV Telugu Site icon

Delhi: విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి మంత్రి అతిషి లేఖ

Atiesh

Atiesh

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కంప్లంట్‌లు పెరిగిపోయాయి. అప్రమత్తమైన ఆప్ ప్రభుత్వం.. సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి ఆప్ మంత్రి అతిషి లేఖ రాశారు. ఢిల్లీలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఖట్టర్‌కు అతిషి లేఖ రాశారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని విన్నవించారు.

ఇది కూడా చదవండి: Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని మండోలాలోని పీజీసీఐఎల్ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి ఢిల్లీకి 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం అగ్నిప్రమాదం సంభవించి సబ్ స్టేషన్ కాలిపోవడంతో ఢిల్లీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి: Khammam Crime: భూమి కోసం కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి అక్కను చంపిన తమ్ముడు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి..

ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కూడా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ ఇబ్బంది కరణంగా మారింది. ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా విద్యుత్ కోతలపై నెటిజన్లు కంప్లంట్‌లు చేస్తున్నారు. తక్షణమే విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆప్ మంత్రి అతిషి స్పందించారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: EPFO: ఆధార్‌ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు