Athulya Ravi Bold Comments about Virginity and Living Relation ship: కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా హీరోయిన్ అతుల్య రవి వర్జినీటి, లివింగ్ రిలేషన్ షిప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యను కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు యాంకర్. అయితే అతుల్య కూడా ఏమాత్రం తడుముకోకుండా వాటికి సమాధానంగా తన మనసులోని మాట్లలు చెప్పేశారు. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి అతుల్య బదులిస్తూ.. నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు వర్జినీటి కోల్పొవడానికి కరెక్ట్ వయసు అనిపిస్తోందని చెప్పింది.
Also Read: Pranita Subhash: బేబీ డాల్ గా మెరుస్తున్న ప్రణీత సుభాష్
ఇక ఆ తరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వని యాంకర్ పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం మంచిదా లేదా పెళ్లి తరువాత సరైనదా అని ప్రశ్నించగా చాలా మందిలాగా సమాధానం కోసం ఎక్కువ సేపు ఆలోచించకుండా తన సమాధానాన్ని చెప్పేసింది ఈ ముద్దు గుమ్మ. నా అభిప్రాయం ప్రకారం పెళ్లి తరువాతే అలాంటి పనులు చేయడం మంచిది. అదే మన ఆచారం, సంప్రదాయం. అయితే ఈ మధ్య లివింగ్ రిలేషన్ షిప్స్ కామన్ అయిపోయాయి. దీంతో రిలేషన్ షిప్స్ కొంత పుంతలు తొక్కుతున్నాయి. అయితే ఎవరితో రిలేషన్ తో ఉండాలి అనేది వారి వ్యక్తిగతం. నా వరకు పెళ్లే ఉత్తమమైన రిలేషన్ షిప్’ అని పేర్కొంది.
2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ, కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే మీటర్ సినిమా ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కోలీవుడ్ లో మాత్రం ఆ అమ్మడికి ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.