Athidhi Trailer: హర్రర్ లవర్స్ రెడీగా ఉండండి.. ప్యాంట్ తడిచిపోయే సిరీస్ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Athidhi Trailer: ఒక్కప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి .. రామారావు ఆన్ డ్యూటీ అనే సినీమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా వేణుకు పరాజయాన్ని అందించినా అవకాశాలను మాత్రం దండిగానే అందించిందని అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం వేణు.. డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ కన్నా ఓటిటీల మీదనే మనసు పారేసుకున్నారన్న విషయం విదితమే. దీంతో స్టార్లు కూడా ఓటిటీ బాట పడుతున్నారు. వెబ్ సిరీస్ లతో ఓటిటీ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తాజాగా వేణు కూడా ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు తొట్టెంపూడి, అవంతిక, సియా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ అతిథి. భరత్ YG దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను ప్రవీణ్ సత్తారు నిర్మించడం విశేషం. హర్రర్ నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా ప్యాంట్ తడిసిపోయేలా భయపెడుతుంది అని చెప్పొచ్చు.
Rajinikanth: జైలర్ నటుడు మృతి.. ఎమోషనల్ అయిన రజినీ
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
” చాలా ఏళ్ల కిందట.. ఒక అమ్మాయి ప్రేమించిన వాడు మోసం చేశాడు అని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పటిసంది.. ఈ త్రోవకు పది కిలోమీటర్ల మెట్టకాడ ఆగి వచ్చేపోయేవారని అడ్డుకుంటా ఉంటుంది” అని ఒక ముసలి తాత వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక రవి.. ఒక రచయిత. తాను కథ రాయడానికి ఆలోచనలు ఏమి రాక.. ఒక బంగ్లాకు వెళ్తాడు. అక్కడ కథ రాస్తుంటే.. ఒక అమ్మాయి హెల్ప్ కావాలంటూ ఇంట్లోకి వస్తుంది. ఆ తరువాత ఆ ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అన్న కథను రవి కొట్టిపాడేయడంతో ఆమె దెయ్యంలా మారి.. అతని ఇంటికి వచ్చి.. ఎవరిపై పగ తీర్చుకోవాలనుకుంది.. దెయ్యానికి, రవికి ఉన్న సంబంధం ఏంటి.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో అవంతిక దెయ్యంలా కనిపిస్తుంది. సియా గౌతమ్ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి అని తెలుస్తోంది.హర్రర్ సినిమాలకు హైలైట్ అంటే మ్యూజిక్. సగం ప్రేక్షకులను మ్యూజికే భయపెడుతుంది. కపిల్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకొంటుంది. హర్రర్ లవర్స్ కు ఈ సిరీస్ ఒక మంచి మీల్ లా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. సెప్టెంబర్ 19 న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!