NTV Telugu Site icon

Atchannaidu: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ.. ప్రభుత్వ సలహాదారుపై ఫిర్యాదు

Attchennaidu

Attchennaidu

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి అచ్చెన్నాయుడు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Chandrababu: మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్..

ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22న ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా వీడియో కాన్ఫరెన్సులు నిషేధం అని చెప్పారు. అందుకు విరుద్ధంగా వైసీపీ నేతలు.. అభ్యర్ధులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐపీసీ 171, 123, 129, 134, 134A సెక్షన్‌లను సజ్జల ఉల్లంఘించారు.. RP 1951 యాక్ట్‌కు విరుద్ధంగా సజ్జల వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Bengaluru: ప్రజలకు నీటి కష్టాలు.. 22 కుటుంబాలకు జరిమానా