El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- చిలీ అటకామా ఎడారిలో లక్షలాది పూల వికాసం
- ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతంలో ప్రకృతి అద్భుతం
- ఎల్ నినో సంబంధిత భారీ వర్షాలతో పుష్పాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
El Nino Effect: ప్రపంచంపై ఈ ఏడాది ‘‘ఎల్ నినో’’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు తీవ్రంగా మారినట్లు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎల్ నినో వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల నెలకొంటే, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు సంభవిస్తాయి.
ఇదిలా ఉంటే, ఎల్ నినో ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటైన చిలీలోని అటకామా ఎడారిలో ఇప్పుడు రంగురంగుల పూలు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా బీడు భూములుగా ఉండే ఈ ఎడారిలో ఈ ఏడాది అసాధారణ రీతిలో వర్షాలు కురిశాయి. దీంతో నేల కింద ఎన్నో ఏళ్లుగా నిద్రావస్థలో ఉన్న విత్తనాలు, దుంపలు మళ్లీ మొలకెత్తాయి. దీంతో ఉత్తర చిలీలోని అనేక ప్రాంతాలు ఇప్పుడు ఊదా, తెలుపు రంగు పూలతో దర్శనమిస్తున్నాయి. ఈ సహజ దృశ్యాలను ‘డెసియెర్టో ఫ్లోరిడో (Flowering Desert) అని పిలుస్తారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఈ ఏడాది అసాధారణ వర్షాలు:
సాధారణంగా ఎంతో పొడిగా ఉండే అటకామా ఎడారిలో ఈసారి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎల్ నినో దీనికి ఒక కారణమని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 180 మిల్లీమీటర్లకు పైగా నమోదైంది. అటకామా వంటి ప్రాంతాల్లో ఇది అసాధారణం. భారీ వర్షాలు కరవడంతో నేల లోపల ఉన్న విత్తనాలకు తేమ లభించడంతో మొలకెత్తాయి. దాదాపు 200 రకాల మొక్కల విత్తనాలు, భూగర్భ దుంపలు చాలా కాలం పాలు నిద్రావస్థలో ఉండగలవు. సరైన సమయంలో వర్షం లభిస్తే మొలకెత్తుతాయి.
అక్టోబర్‌లో పూల పండగ..
వర్షాల తర్వాత పూలు మాత్రమే కాదు, ఎడారిలో జీవ వైవిధ్యం కూడా మారుతోంది. పొప్పొడి సేకరించేందుకు తేనెటీగలు, ఇతర కీలకాలు, వాటిపై ఆధారపడే పక్షులు, సరీసృపాలు కనిపిస్తున్నాయి. చిలీ నేషనల్ ఫారెస్ట్ కార్పొరేషన్ CONAF అంచనాల ప్రకారం ఈసారి అక్టోబర్ నెలలో పూలు వికసించడం గరిష్టస్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పింది. వీటిని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు రానున్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!