NTV Telugu Site icon

Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..

Ujjain

Ujjain

క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్‌కు ముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై ‘ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఎస్‌డిఎమ్‌తో ఈ అంశంపై చర్చించారు. రెండు రోజుల్లో చర్చి నుండి దేవాలయం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు హింసాత్మక ఆందోళనలు కూడా తప్పవని హెచ్చరించారు. ఈ వివాదం పెరగడంతో చర్చి ట్రస్టీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న బోర్డుపై ‘మందిర్’ అనే పదాన్ని తొలగించారు.

READ MORE: Wayanad: ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య సవాల్.. అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్

హిందూ సమాజానికి చెందిన గ్రామస్థులు దానిని దేవాలయంగా అనుకుని అందులోకి వెళ్లేందుకు, మత మార్పిడి ఉచ్చులో భాగంగా ఇల చేశారని.. హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన ఉజ్జయినిలోని దేవాస్ రోడ్డులో ఉన్న 78 ఏళ్ల నాటి చర్చికి సంబంధించినది. ప్రధాన ద్వారంపై ‘మసిహి మందిర్ చర్చి’ అని రాసి ఉంది. బుధవారం నుంచి వివాదం మొదలైనట్లు సమాచారం.దీనిపై వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మహేశ్ తివారీ మాట్లాడుతూ.. “చర్చిపై దేవాలయం అని రాయడం వల్ల హిందూ సోదరులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది. కాబట్టి దేవాలయం అనే పదాన్ని తొలగించాలి. చర్చిపై దేవాలయం రాయడం వల్ల మన మత విశ్వాసాలు దెబ్బతింటాయి. అమాయక హిందూ సమాజం అయోమయానికి గురవుతోంది. హిందూ మతంలో దేవాలయం అనే పదాన్ని సనాతని ఆలయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ పదాన్ని చర్చిలకు జోడించడం సరికాదు.” అని పేర్కొన్నారు .

READ MORE: Minister Nimmala Rama Naidu: అన్నదాత‌ల అండ‌దండ‌ల‌న్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..

Show comments