Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..
- క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్
- ప్రారంభమైన చర్చిల అలంకరణ
- ఉజ్జయినిలో గందరగోళం
- చర్చిపై మందిర్ అని రాసిన బోర్డు ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్కు ముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై ‘ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఎస్‌డిఎమ్‌తో ఈ అంశంపై చర్చించారు. రెండు రోజుల్లో చర్చి నుండి దేవాలయం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు హింసాత్మక ఆందోళనలు కూడా తప్పవని హెచ్చరించారు. ఈ వివాదం పెరగడంతో చర్చి ట్రస్టీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న బోర్డుపై ‘మందిర్’ అనే పదాన్ని తొలగించారు.
READ MORE: Wayanad: ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య సవాల్.. అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
హిందూ సమాజానికి చెందిన గ్రామస్థులు దానిని దేవాలయంగా అనుకుని అందులోకి వెళ్లేందుకు, మత మార్పిడి ఉచ్చులో భాగంగా ఇల చేశారని.. హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన ఉజ్జయినిలోని దేవాస్ రోడ్డులో ఉన్న 78 ఏళ్ల నాటి చర్చికి సంబంధించినది. ప్రధాన ద్వారంపై ‘మసిహి మందిర్ చర్చి’ అని రాసి ఉంది. బుధవారం నుంచి వివాదం మొదలైనట్లు సమాచారం.దీనిపై వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మహేశ్ తివారీ మాట్లాడుతూ.. “చర్చిపై దేవాలయం అని రాయడం వల్ల హిందూ సోదరులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది. కాబట్టి దేవాలయం అనే పదాన్ని తొలగించాలి. చర్చిపై దేవాలయం రాయడం వల్ల మన మత విశ్వాసాలు దెబ్బతింటాయి. అమాయక హిందూ సమాజం అయోమయానికి గురవుతోంది. హిందూ మతంలో దేవాలయం అనే పదాన్ని సనాతని ఆలయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ పదాన్ని చర్చిలకు జోడించడం సరికాదు.” అని పేర్కొన్నారు .
READ MORE: Minister Nimmala Rama Naidu: అన్నదాతల అండదండలన్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి