NTV Telugu Site icon

At Home Program: రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్, పలువురు నేతలు

At Home 1

At Home 1

రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరుకాగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం హాజరు కాలేదు.

Read Also: Minister RK Roja: 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్‌లోకల్‌ పొలిటిషన్స్‌ను ఎవరూ పట్టించుకోరు

ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్‌ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే. కాగా.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నాంపల్లి పబ్లిక్​ గార్డెన్స్‌లో తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని గవర్నర్ గుర్తుచేశారు. అలాగే గత ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా పాలనపై దృష్టి పెట్టిందని గవర్నర్ తమిళిసై అన్నారు. కార్యక్రమం అనంతరం.. గవర్నర్ తమిళి సైతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Read Also: Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..