NTV Telugu Site icon

Cruel Woman: ప్రియుడి సాయంతో భర్త, అత్తను ముక్కలుగా నరికింది.. కవర్లో పెట్టి కాల్వలో వేసింది

Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది. ఆపై పోలీసులకు తన భర్త, అత్త ఇద్దరూ కనబడడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపగా నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు నిందితులు కటకటాల పాలయ్యారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) దిగంత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. అస్సాంకు చెందిన మహిళ తన భర్త, అత్త అమరేంద్ర దే, శంకరి దేలు సెప్టెంబర్‌లో తప్పిపోయారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అమరేంద్ర బంధువు మరొక మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై అనుమానం వచ్చిందన్నారు.

Read Also: Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం

నూన్‌మతి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ రెండు హత్యలు గౌహతిలోని చంద్‌మారి, నారేంగి ప్రాంతాల్లోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగాయి. అమరేంద్ర భార్య, ఆమె ప్రేమికుడు, మరొక వ్యక్తి ఈ హత్యలు చేశారని కనుగొన్నాడు. ఆమెకు హత్యలో సాయం చేసిన వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడని గుర్తించారు.

Read Also:Monday Sick Leave: సోమవారం లీవ్ పెట్టింది.. ఉద్యోగం పోయింది.. కోర్టు ఝలకిచ్చింది

హత్యల తరువాత, వారు మృతదేహాలను చిన్న ముక్కలుగా చేసి.. వాటిని సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఆ ముక్కలను కాల్వలోకి విసిరేశారు. పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టి మేఘాలయ నుండి చనిపోయిన వారి మృతదేహాలకు చెందిన.. కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఇద్దరి శరీర భాగాలన్నింటిని కనుగొనడానికి ఇంకాస్త సయమం పడుతుందని .. అప్పటివరకు ఆపరేషన్ కొనసాగుతోందని డీసీపీ దిగంత్ కుమార్ చౌదరి తెలిపారు.

Show comments