దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా సామాజిక-ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన డేటాను సేకరించడంలో.. అలాగే సరిహద్దు నిఘాకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ఈ ప్రకటన చేశారు.
Read Also: Priya Prakash : నాకు మూవీ ఛాన్సులు ఇవ్వట్లేదు.. ఆ పని చేసుకుంటున్నా..!
“కీలకమైన సామాజిక-ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు నిరంతర డేటా ప్రవాహం కోసం.. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం, IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్)తో సహకారంతో, సొంత ఉపగ్రహం ‘అసంసత్’ ను ఏర్పాటు చేయాలని మేము ప్రణాళిక వేసుకున్నాము. కీలకమైన ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇదెంతో దోహదం చేస్తుంది’’ అని ఆర్థికమంత్రి అజంతా నియాగ్ వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: ప్రైజ్‌మనీ రివీల్ చేసిన ఐసీసీ.. భారత్‌కు ఎంతంటే..?
ఈ అంశంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. “మనకు మన సొంత ఉపగ్రహం ఉంటే, అది విదేశీయులు అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తారా లేదా అని చెబుతుంది. ఇది రాబోయే వరదల గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వగలదు. అలాగే వాతావరణ నివేదికలు కూడా అందించగలదు. ఇది రైతులకు ప్రయోజనకరంగా మారుతుంది,” అని తెలిపారు. దీని ఏర్పాటు కోసం ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.