Assam Flood: అస్సాంలో వరద విధ్వంసం.. 9 జిల్లాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Flood: అస్సాంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తొమ్మిది జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. అయితే వరద నీరు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అస్సాం స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) అధికారులు తెలిపారు. పలు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని షా హామీ ఇచ్చారు.
Read Also:Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?
Also Read
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
ASDMA నివేదిక ప్రకారం, బక్సా, ఉదల్గురి, నల్బారి, లఖింపూర్, కమ్రూప్, గోల్పరా, ధుబ్రి, దర్రాంగ్, బార్పేట జిల్లాలకు చెందిన నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. ప్రజల సహాయార్థం 101 శిబిరాలు నిర్వహిస్తున్నారు. 81 వేల మందికి పైగా ఇక్కడ ఆశ్రయం పొందారు. ఐదు జిల్లాల్లో 119 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. 1,118 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయని ASDMA తెలిపింది. వరదల కారణంగా రైతుల పంటలు నాశనమయ్యాయి. 8,469.56 హెక్టార్ల భూమి పూర్తిగా నీట మునిగింది.
Read Also:Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
కరీంగంజ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. తొమ్మిది జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయంటే వరద బీభత్సాన్ని ఊహించవచ్చు. అస్సాం సీఎంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అస్సాం ప్రజలకు అండగా నిలుస్తుందని షా అన్నారు.
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?