Himanta Biswa Sarma: బాల్య వివాహాల నిర్మూలనే మా లక్ష్యం
- అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బాల్య వివాహాలు అరికట్టేందుకు నిజుత్ మొయినా పథకానికి కేబినేట్ ఆమోదం..
- అమ్మాయిల భవిష్యత్ కోసం ఈ పథకం: అసోం సీఎం హిమంత బిస్వా శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బాల్య వివాహాలు అరికట్టేందుకు నిజుత్ మొయినా పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు రాష్ట్రంలోని బాలికలను ప్రభుత్వమే చదివించబోతుంది. దీనికోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ప్రభుత్వం ప్రతి నెలా విద్యార్థినీల ఖాతాల్లో రూ.1000 జమ చేయబోతుందన్నారు. డిగ్రీలో చేరినవారికి రూ.1,250, పీజీ (పోస్టు గ్రాడ్యుయేషన్) చేసే వారికి రూ.2,500 ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక, వేసవి సెలవుల్లో మాత్రం ప్రభుత్వం నుంచి స్టైఫండ్ రాదన్నారు. ఏడాదిలో పది నెలల పాటు విద్యార్థినీల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది అన్నమాట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుమార్తెలు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినీలు మినహా అందరూ ఈ పథకానికి అర్హులే అని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
Read Also: Mega Family: పవన్ కోసం కదిలొచ్చిన మెగా కుటుంబం (Video)
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
అలాగే, బాల్య వివాహాలు నిర్మూలించడంతో పాటు అమ్మాయిల బంగారు భవిష్యత్ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. ప్రతినెలా 11న విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తామన్నారు. పీజీ కోర్సుల్లో చేరిన పెళ్లైన యువతులకు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే, ఈ పథకం వల్ల తల్లిదండ్రులపై భారం చాలా వరకు తగ్గుతుందన్నారు. తమ కుమార్తెలను కాలేజీలకు, యూనివర్సిటీలకు పంపేందుకు అవకాశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!