NTV Telugu Site icon

Himanta Biswa Sarma: భారత్లోకి బంగ్లాదేశీయులు ఎంట్రీపై అస్సాం సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

భారత్లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు నివసిస్తున్నారు.. వారు పోరాడుతున్నారు. గత నెల రోజులుగా ఒక్క హిందువు కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని అన్నారు.

Read Also: Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్

అయితే.. టెక్స్‌టైల్ రంగంలో ఉపాధి కోసం బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. గత నెలలో 35 మంది ముస్లిం చొరబాటుదారులను అరెస్టు చేశామన్నారు. వారు అస్సాంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ అస్సాంలో నివసించేందుకు కాదని, వారు టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేయడానికి అని ముఖ్యమంత్రి బిశ్వ శర్మ చెప్పారు. కాగా.. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రధాని మోడీని అభ్యర్థించామని సీఎం చెప్పారు.

Read Also: Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు

ఈ నెల మొదట్లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం గద్దె దించిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ వర్గాలకు చెందిన వారిపై పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుండి 48 జిల్లాల్లో 278 చోట్ల మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడులు జరిగాయని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ మహా కూటమి తెలిపింది.