ఆసియా కప్ 2023 విషయమై ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిరేలా కనిపించడం లేదు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు్ చూసింది. హైబ్రిడ్ మోడ్ ప్రకారం పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు.. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ ప్లాన్ చేసింది. కానీ హైబ్రిడ్ మోడ్‌కు బీసీసీఐ అంగీకరించకపోవడంతో.. ఆ టైంలో దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు తెలుస్తోంది. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడ్‌కు ఒప్పుకోనట్లు తెలుస్తోంది.
Also Read : Krithi Shetty: అందానికే అద్దంలా.. హాట్ లుక్స్‌తో బేబమ్మ మెస్మరైజ్
దీంతో పాకిస్తాన్ లేకుండానే ఆసియా కప్ జరగనున్నట్లు టాక్. టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్ మినహా ఆసియా కప్ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు సమాచారం. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరిగే అవకాశం ఉంది.
Also Read : Aircraft Crash: కూలిన వాయుసేన శిక్షణ విమానం.. పైలట్లు సేఫ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్పష్టమైన సందేశం పంపే ఛాన్స్ ఉంది. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు మరో ఆప్షన్ లేదు.
Also Read : Rahul Gandhi: నాకే ఎక్కువ శిక్ష పడింది.. ఇలా జరుగుతుందని ఊహించ లేదు
ఒకవేళ ఈ ఈవెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌లు శ్రీలంక వేదికగా ఆసియా కప్‌లో ఆడనున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్-నవంబర్‌లలో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్ ఉంది. అయితే ఇది పాకిస్తాన్‌కే నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆసియా కప్ సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు నిర్వహించేందుకు ఏసీసీ ప్లాన్ చేస్తుంది.