Site icon NTV Telugu

IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు బెనిఫిట్?

Ind Vs Pak

Ind Vs Pak

ఆసియా కప్‌ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

దుబాయ్‌లో ఈరోజు సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ సమయంలో గంటకు 13 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గల్ఫ్ దేశమైన యుఎఇలో వర్షం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం లేదు. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం దాదాపుగా లేదు. ప్రస్తుతానికి అక్కడ మంచి వాతావరణం ఉంది. అయితే వర్షం లేదా మరేదైనా కారణం చేత మ్యాచ్ రద్దు చేయబడితే. రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. ఇప్పటివరకు ఆసియా కప్‌ 2025లో ఒక్క మ్యాచ్ కూడా రద్దు కాలేదు. వర్షం ఎలాంటి ఆటకం కలిగించలేదు.

Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. శుభ్‌మన్ గిల్‌కు అభిషేక్ శర్మ సూచనలు!

ఆసియా కప్‌ 2025 సూపర్ ఫోర్ దశ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగుతుంది. ఓ టీమ్ మిగతా మూడు జట్లతో ఒకసారి తలపడుతుంది. సూపర్-4 ముగిసేసరికి అగ్ర స్థానంలో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి.మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు, రద్దైతే ఒక పాయింట్ దక్కుతుంది. ఈ మ్యాచ్ రద్దైతే భారత్, పాకిస్తాన్ జట్లకు లాభించనుంది. సూపర్-4లో శ్రీలంక ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడింది. భారత్, పాకిస్తాన్ జట్లతో లంక ఆడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. లంక ఇంటికి పోవాల్సిందే. ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లా కూడా భారత్, పాకిస్తాన్ జట్లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచులలో బంగ్లా ఒక్కటి ఓడినా అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు భారత్, పాకిస్తాన్ రెండు మ్యాచులు గెలిస్తే ఫైనల్ చేరుకునే ఆవకాశాలు ఉంటాయి.

Exit mobile version