Site icon NTV Telugu

Asia Cup 2025: పాకిస్థాన్ కెప్టెన్‌కు ఎంత బలుపు.. వీడియో వైరల్! ఎక్కడో కాలినట్టుంది సీనా

Pakistan Runner Up Cheque

Pakistan Runner Up Cheque

ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్‌ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫర్హాన్‌ (57), ఫకార్‌ జమాన్‌ (46) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్‌ వర్మ (69 నాటౌట్‌), శివమ్‌ దూబె (33), సంజూ శాంసన్‌ (24) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌ 19.4 ఓవర్లలో ఛేదించింది.

మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్స్ నిరాకరించారు. దాంతో ఫైనల్ వేడుక కార్యక్రమం గంటన్నర లేటుగా ఆరంభం అయింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం అనంతరం పాకిస్థాన్ టీమ్ రన్నరప్ ట్రోఫీని తీసుకుంది. ఆపై పాక్ ఆటగాళ్లకు కూడా ఒక్కొక్కరుగా అవార్డు అందుకున్నారు. చివరగా సల్మాన్‌ ఆఘా అవార్డును అందుకున్నాడు. ఆపై రన్నరప్ చెక్‌ను పాక్ అధికారులు అతడికి అందజేశారు. ఆ చెక్‌ను సల్మాన్‌ ఆఘా అక్కడే విసిరేశాడు. స్టేజ్‌పై పాక్ కెప్టెన్ తీరు చూసి స్పాన్సర్లు, అతిథులు షాక్‌కు గురయ్యారు.

Also Read: Asia Cup 2025: మ్యాచ్ అనంతరం హైడ్రామా.. ట్రోఫీని తీసుకోని భారత్! సంబరాలు మాత్రం హైలెట్

పాకిస్థాన్ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా చెక్‌ను విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘పాకిస్థాన్ కెప్టెన్‌కు ఎంత బలుపు’, ‘ఎక్కడో కాలినట్టుంది సీనా’ అంటూ ఇండియన్ ఫాన్స్ కామెంట్స్ పెట్టారు. ఆసియా కప్‌ 2025లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. పక్షం రోజుల్లో మూడుసార్లు పాకిస్థాన్ పనిపట్టింది. ఫైనల్ విజయంతో ఆసియా కప్‌ను సగర్వంగా తొమ్మిదోసారి కైవసం చేసుకుంది.

Exit mobile version