Team India Squad Announcement Delayed: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నీ కోసం నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. షెడ్యూలు ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే (మధ్యాహ్నం 1.30కు) జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ముంబైలో భారీ వర్షం కారణంగా జట్టు ప్రకటన కాస్త ఆలస్యం అవ్వనుంది. విలేకరుల సమావేశం సైతం ఆలస్యంగా ప్రారంభం కానుంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కాసేపటి క్రితమే బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సహా కొంతమంది బీసీసీఐ సెలెక్టర్లు ఇంకా కార్యాలయానికి చేరుకోలేదు. బీసీసీఐ సభ్యులు అందరూ హాజరైన తర్వాత విలేకరుల సమావేశం ప్రారంభం కానుంది.
భారత జట్టును ప్రకటించబోతున్న నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. గిల్‌కు టీ20 జట్టులో చోటు కష్టమే అని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్లకు చోటు కష్టమే. బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
Also Read: T20 World Cup 2024: బౌండరీ రోప్ వెనక్కి జరిపారు.. సూర్య క్యాచ్‌పై రాయుడు సెన్సేషనల్ కామెంట్స్!
2025 ఆసియా కప్ కోసం భారత జట్టు: (అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దుబే, సంజు శాంసన్, జితేష్ శర్మ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
