Site icon NTV Telugu

Ind vs Pak: మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్..! పాకిస్థాన్ మరోసారి బహిష్కరణ నాటకం ఆడనుందా..?

Pak

Pak

Ind vs Pak: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారని వర్గాలు సూచిస్తున్నాయి. మునుపటి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో కూడా ఈయనే రిఫరీగా ఉన్నారు.

READ MORE: Duddilla Sridhar Babu : ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఎక్కడ.?

గత భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో సైతం పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం పాకిస్థాన్‌ ప్లేయర్స్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఈ వివాదంపై పైక్రాఫ్ట్‌ను బాధ్యుణ్ని చేస్తూ.. ఐసీసీకి రెండు ఫిర్యాదు లేఖలు పంపింది. మొదటి మెయిల్‌లో అతణ్ని రిఫరీగా టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. రెండో లేఖలో పైక్రాఫ్ట్‌ను కనీసం పాక్‌ మ్యాచ్‌లకైనా దూరం పెట్టాలని అభ్యర్థించింది. అయితే.. పీసీబీ డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. కాగా.. గత యూఏఈ-పాకిస్థాన్ మ్యాచ్‌లో సైతం పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. మ్యాచ్‌కు ముందు ఆండీ పైక్రాఫ్ట్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చాలా వివాదం సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం అయినప్పటికీ జట్టు గ్రౌండ్‌లోకి రాలేదు.

READ MORE: Vasantha Krishna Prasad: జోగి రమేష్‌కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసు..!

ICC, PCB, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత.. గంట సమయం వేస్ట్‌చేసిన పాక్ జట్టు చివరికి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. కాగా.. ఈసారి గతసారి వివాదం చెలరేగిన స్టేడియంలోనే భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఇరు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఎప్పుడూ హై-వోల్టేజ్ వ్యవహారం. అయితే.. ఆండీ పైక్రాఫ్ట్‌ను నియమించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని నాటకాలు ఆడనుందా? లేదా భారత్‌తో ఎలాంటి వివాదాలు లేకుండా మ్యాచ్‌ను ముగిస్తుందా? అని వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version