Is Gautam Gambhir’s Influence Changes Agarkar’s Choice: యూఏఈలో సెప్టెంబర్ 9న ఆరంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో జట్టును ప్రకటించాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఇక అందరూ ఊహించినట్లే వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ వెల్లడించిన మొదటి పేరు గిల్‌దే కావడం గమనార్హం. అయితే వైస్ కెప్టెన్‌గా అగార్కర్ ఫస్ట్ ఛాయిస్ గిల్ కాదట. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంట్రీతో చీఫ్ సెలక్టర్ అగార్కర్ తన మనసు మార్చుకున్నాడని తెలుస్తోంది.
మొన్నటివరకూ వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఉన్నాడు. ఆసియా కప్ 2025లో కూడా అతడినే కొనసాగించాలని మేనేజ్‌మెంట్ భావించింది. భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు గాను శుభ్‌మన్ గిల్‌కు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ అప్పగించాలని కోచ్ గౌతమ్ గంభీర్ కోరాడు. యువ ఆటగాడు గిల్‌ను ఎంపిక చేస్తే.. భారత్ భవిష్యత్తుకు మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. గౌతీ సూచనలను పరిగణలోకి తీసుకుని గిల్‌నే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గంభీర్ వర్చువల్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ భేటీలో పాల్గొన్నాడని సమాచారం.
Also Read: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. నేడు కూడా భారీ తగ్గింపు!
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ అనంతరం వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపడతాడు. 2026 టీ20 ప్రపంచకప్ లోగా టీ20 కెప్టెన్ అవుతాడని అందరూ అంటున్నారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ బాగానే జట్టును నడిపిస్తున్నాడు కాబట్టి.. ఉన్నపళంగా అతడిని తీసేయలేదు. గిల్‌కు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. 2-3 సిరీస్‌లలో సూర్య విఫలమయితే.. గిల్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కలేదు. ఇక చివరిసారిగా గిల్ శ్రీలంకతో సిరీస్‌లో ఆడాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పటివరకు 21 టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 578 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మట్లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
