India Playing XI vs UAE in Asia Cup 2025: మినీ కప్ ‘ఆసియా కప్’ 2025కి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో (సెప్టెంబర్ 9) యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ఆరంభం కానున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌లో హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న భారత్ తన మొదటి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. మినీ కప్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే ఆసియా కప్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్లేయింగ్ 11లో ఎవరుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అభిషేక్ శర్మ ఒక ఓపెనర్‌గా ఆడడం ఖాయం. శుభ్‌మన్ గిల్ ఎంట్రీతో సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. సంజూను బ్యాకప్ మాత్రమే అని టీమ్ సెలక్షన్ సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. అభిషేక్, గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు చేసినా సంజూకు తుది జట్టులో చోటు కష్టమే. మూడో స్థానంలో తిలక్ వర్మ.. 4, 5 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆడనున్నారు. లెఫ్టాండర్ శివమ్ దూబే మిడిలార్డర్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.
కీపర్‌గా జితేష్ శర్మ తుది జట్టులో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సంజూ శాంసన్‌ను ఆడించాలనుకుంటే.. జితేష్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. 8వ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆడనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీకి చోటు పక్కా. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు బరిలోకి దిగుతారు. హర్షిత్ రాణాకు నిరాశ తప్పదు. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి శివమ్ దూబే స్థానంలో కుల్దీప్ ఆడే అవకాశాలను కొట్టిపారేయలేం. హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ కూడా బెంచ్‌కే పరిమితం అవ్వక తప్పదు. చూడాలి మరి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎవరిని ఎంచుకుంటాడో.
Also Read: Asia Cup 2025: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గాన్ సారథికి ప్రశ్న.. తెగ ఇబ్బందిపడ్డ పాక్ కెప్టెన్!
భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ(కీపర్), శివమ్ దూబే/కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
