ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో రెండు బంతులు ఉండగానే ఛేదించి.. తొమ్మిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది.
ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్స్ నిరాకరించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే భారత్ ఫైనల్ వేడుకను బహిష్కరించింది. ప్లేయర్స్ అందరూ మైదానంలో పడుకుని తమ ఫోన్స్ చూసుకున్నారు. భారత్ ప్లేయర్స్ కోసం స్టేజ్‌పై ఏసీసీ చీఫ్ సహా యూఏఈ పెద్దలు పడిగాపులు కాశారు. అయినా కూడా మనోళ్లు తగ్గలేదు. దాంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది.
భారత్ ప్లేయర్స్ బెట్టు చేయడంట్ ఫైనల్ వేడుక కార్యక్రమం గంటన్నర లేటుగా ప్రారంభమైంది. ఎట్టకేలకు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. చివరకు పాకిస్థాన్ ఆటగాళ్లు తమ రన్నరప్ ట్రోఫీని ఆందున్నారు. ఆపై ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్‌ను తిలక్ వర్మ, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డ్‌ను అభిషేక్ శర్మలు అందుకున్నారు. ఈ వార్డులను దుబాయ్ పెద్దలు అందించారు. అవార్డ్స్ అందుకున్న అనంతరం మనోళ్లు హోస్ట్ సైమన్ డౌల్‌తో మాట్లాడారు. ఆపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తమ ఓటమిపై స్పందించాడు. ఇక ఫైనల్ వేడుక ముగిసిందని హోస్ట్ చెప్పాడు.
Also Read: Today Horoscope: ఆ రాశి వారికి నేడు అన్నీ అనుకూలమే.. పట్టిందల్లా బంగారమే!
ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం భారత్ ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలెబ్రేట్ చేసుకున్నారు. వేదికపై ఉండి ట్రోఫీ చేతిల్లో ఉన్నట్లు సంబరాలు జరుపుకున్నారు. టీమిండియా ప్లేయర్స్ ట్రోఫీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే చేతిలో కప్ ఉన్నట్లు నడుచుకుంటూ స్టేజీపైకి ఎక్కాడు. ఈ సంబరాలు హైలెట్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు భారత్ నిరాకరించింది.
