NTV Telugu Site icon

Asia Cup 2023 Awards List: ఆసియా కప్ విన్నర్ భారత్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?.. అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే

Asia Cup 2023 Awards List

Asia Cup 2023 Awards List

Asia Cup Complete List of Award Winners Prize Money: శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌ 2023ను భారత్ సొంతం చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (6/21) చెలరేగడంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (27 నాటౌట్; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు.

ఆసియా కప్ విన్నర్ ప్రైజ్ మనీ:
ఆసియా కప్‌ 2023 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీమిండియా 150,000 యూఎస్ డాలర్లను (భారత కరెన్సీలో సుమారు రూ. 1 కోటీ 25 లక్షలు) ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు 75,000 యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 62 లక్షలు) ప్రైజ్ మనీగా దక్కింది.

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రైజ్ మనీ:
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. 15,000 యూఎస్ డాలర్లను (రూ. 12 లక్షలు) మణికట్టు స్పిన్నర్ ప్రైస్ మనీగా అందుకున్నాడు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రైజ్ మనీ:
ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసిన మహ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దాంతో సిరాజ్ 5,000 (రూ. 4.16 లక్షలు) యూఎస్ డాలర్లను ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ మొత్తంను అతను గ్రౌండ్స్‌మన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సిరాజ్‌ ఫైనల్లో ఆరు వికెట్స్ (6/21) పడగొట్టిన విషయం తెలిసిందే.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

‘క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్ మనీ:
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ‘క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దాంతో జడేజా 3,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు.