NTV Telugu Site icon

కారులో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్సై.. 36 ఫుల్ బాటిల్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Liquor

Liquor

తెలంగాణ నుంచి కారులో అక్రమ మద్యం తరలిస్తూ.. ఓ ఏఎస్సై పట్టుబడ్డాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టగా.. గురజాల పట్టణ ఏఎస్సై (స్టేషన్ రైటర్) స్టాలిన్ పట్టుబడ్డాడు. స్టాలిన్ సహా తెలుగుదేశం పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, కొండలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 36 ఫుల్ బాటిల్‌లను, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. పొందుగల చెక్‌పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో తెలంగాణ సరిహద్దు నుండి ఏపీలోకి అతివేగంగా వస్తున్న ఏపీ39జేటి9618 వాహనాన్ని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు ఆపే ప్రయత్నం చేశారు. కారు డ్రైవర్ కొంత దూరం ముందుకు తీసుకుని వెళ్లి.. యూటర్న్ తీసుకుంటుండగా కారులో నుండి ఒక వ్యక్తి కిందకు దూకి పరారయ్యాడు. కారు వద్దకు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు కారులో ఉన్న గురజాల పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, నల్లగార్ల కొండలను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: YS Sharmila: ఫిబ్రవరి 17న వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహం.. ట్వీట్ వైరల్!

ఓ వ్యక్తి పరార్ కాగా.. అతడు స్థానిక గురజాల పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న స్టాలిన్‌గా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. కారులోని 39 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసారు. ఈ తనిఖీలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆర్.వి రమణమ్మ, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు. వారు నిందితులను పట్టుకొని గురజాల ఎస్ఈబి స్టేషన్‌కి తరలించారు. గురజాల ఎస్ఈబి ఇన్స్పెక్టర్ జయరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.