కారులో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్సై.. 36 ఫుల్ బాటిల్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ నుంచి కారులో అక్రమ మద్యం తరలిస్తూ.. ఓ ఏఎస్సై పట్టుబడ్డాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టగా.. గురజాల పట్టణ ఏఎస్సై (స్టేషన్ రైటర్) స్టాలిన్ పట్టుబడ్డాడు. స్టాలిన్ సహా తెలుగుదేశం పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, కొండలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 36 ఫుల్ బాటిల్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. పొందుగల చెక్‌పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో తెలంగాణ సరిహద్దు నుండి ఏపీలోకి అతివేగంగా వస్తున్న ఏపీ39జేటి9618 వాహనాన్ని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు ఆపే ప్రయత్నం చేశారు. కారు డ్రైవర్ కొంత దూరం ముందుకు తీసుకుని వెళ్లి.. యూటర్న్ తీసుకుంటుండగా కారులో నుండి ఒక వ్యక్తి కిందకు దూకి పరారయ్యాడు. కారు వద్దకు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు కారులో ఉన్న గురజాల పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, నల్లగార్ల కొండలను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
Also Read: YS Sharmila: ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడి వివాహం.. ట్వీట్ వైరల్!
ఓ వ్యక్తి పరార్ కాగా.. అతడు స్థానిక గురజాల పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న స్టాలిన్‌గా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. కారులోని 39 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసారు. ఈ తనిఖీలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆర్.వి రమణమ్మ, ఎస్.ఆంజనేయులు పాల్గొన్నారు. వారు నిందితులను పట్టుకొని గురజాల ఎస్ఈబి స్టేషన్‌కి తరలించారు. గురజాల ఎస్ఈబి ఇన్స్పెక్టర్ జయరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- ap
- ASI
- ASI Liquor
- Liquor
- new year 2024
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!