YS Sharmila: ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడి వివాహం.. ట్వీట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atluri Priya, YS Raja Reddy’s engagement on January 18th: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అనిల్ కుమార్, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి 2024 ఫిబ్రవరి 17న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అట్లూరి ప్రియాతో రాజా రెడ్డికి వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. రాజా రెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి.
రాజా రెడ్డి, అట్లూరి ప్రియ వివాహంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్నప్పటికీ వైఎస్ షర్మిల స్పందించలేదు. న్యూఇయర్ సందర్బంగా తనయుడి వివాహంపై మౌనం వీడారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజా రెడ్డికి అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంగళవారం (జనవరి 2) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తాం. అక్కడ ఆహ్వాన పత్రికను ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
Also Read: Manickam Tagore: మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది: మాణిక్కం ఠాగూర్
వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి అమెరికాకు వెళ్లగా.. అక్కడ ప్రియా పరిచయం అయ్యారు. మొదట స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆపై ప్రేమికులుగా మారారు. రాజా, ప్రియా ప్రేమకు ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో త్వరలోనే ఒక్కటవ్వనున్నారు. అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు రాజా పూర్తి చేశారు. చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలే ప్రియా. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియాకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024.
Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi— YS Sharmila (@realyssharmila) January 1, 2024
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!