Site icon NTV Telugu

ASI Daughter Suicide: ఉరేసుకుని ఏఎస్సై కుమార్తె ఆత్మహత్య.. కారణమేంటంటే?

Suicide

Suicide

ASI Daughter Suicide: కర్ణాటకలో మైసూరులో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గోపినాథ్‌ కూతురు గిరిజా లక్ష్మీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మైసూరులోని జలపురి పోలీసు వసతిగృహంలోని సీ బ్లాక్‌లో ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Shallini Kidnap Case: సిరిసిల్ల కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. శాలిని పెళ్లి వీడియోలు విడుదల

పనిమీదు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఇంటికి రాగా గిరిజ ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బీకాం చదువుతున్న గిరిజా ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. నజరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు రోజుల క్రితం గిరిజా లక్ష్మీ సోదరుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఆ బాధే ఆత్మహత్యకు కారణమని అనుమానాలున్నాయి. సూసైడ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Exit mobile version