NTV Telugu Site icon

Ashok Gehlot: ఈసీ తీరుపై మండిపడ్డ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్

Ashok Gehlot

Ashok Gehlot

ఎన్నికల సంఘం ప్రతిస్పందన అన్యాయమైనదని.. అవాంఛనీయమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను త్వరగా ఎందుకు ప్రకటించడం లేదని.. ఈసీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ప్రశ్నించారు. ఈ అంశంపై స్పందించిన ఈసీ ఖర్గెకు లేఖ రాసింది. ఆ లేఖలో ఖర్గే ప్రకటనను ఎన్నికల సంఘం విమర్శించింది. దీనిపై స్పందించిన అశోక్ గెహ్లాట్ తన ఎక్స్ వేదికగా.. లేఖను పోస్టు చేస్తూ.. “ఈ లేఖ భాష తన బాధ్యతతో పనిచేయడం కంటే రాజకీయ పార్టీది అని అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రజల మనస్సులలో సందేహాలను సృష్టిస్తుంది.” ఇలా రాసుకొచ్చారు.

READ MORE: Gulab jamun Dosa: మార్కెట్లోకి కొత్త దోస వచ్చేసింది మామ.. ట్రై చేస్తారా.. వీడియో వైరల్..

ఎన్నికల సంఘం స్పందన సరికాదని.. అభివర్ణించారు. ఎన్నికల సంఘం ఒకే పార్టీకి అండగా నిలుస్తోందని ఆరోపించారు. “పార్టీల మధ్య అంతర్గత సంభాషణలపై ఎన్నికల సంఘం స్పందిస్తోంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 20 ఫిర్యాదులు అందజేసింది. 100కి పైగా ఫిర్యాదులు అందాయి కానీ వాటిపై నోటీసులు కూడా జారీ చేయలేదు.” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. ఎన్నికల సంఘం ఓకే పార్టీవైపు మద్దతుగా ఉందని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈసీకి అధికార పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈసీ తన విధులు తాను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.