NTV Telugu Site icon

IND vs SL: కోహ్లీ, రోహిత్‌ అవసరం లేదు.. ఆశిశ్‌ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు!

Rohit Kohli

Rohit Kohli

Ashish Nehra slams Gautam Gambhir: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ పర్యటనతోనే కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టిన గౌతమ్ గంభీర్‌కు ఈ టూర్ ప్రత్యేకం అని చెప్పాలి. జట్టు ఎంపికలో తన మార్క్‌ చూపించిన గంభీర్‌.. స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలను అందుబాటులో ఉండాలని కోరాడు. గౌతీ విజ్ఞప్తి మేరకు వారిద్దరూ వన్డే సిరీస్‌ ఆడుతున్నారు. అయితే వన్డే సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదని భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్ ఆశిశ్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు.

Also Read: Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది

యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే మంచి అవకాశమని ఆశిశ్‌ నెహ్రా పేర్కొన్నాడు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆడించకుండా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి శ్రీలంక వన్డే సిరీస్‌ రూపంలో మంచి అవకాశం దొరికింది. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్ అని తెలుసు. అతను అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కొంత సమయం గడపాలని అనుకున్నాడు. కానీ కోహ్లీ, రోహిత్‌ గురించి గంభీర్‌కు తెలియంది ఏముంది?. అతడేమీ విదేశీ కోచ్‌ కాదు కదా. కొత్త ఆటగాళ్లను ప్రయత్నించడానికి గౌతీకి ఇది మంచి అవకాశం. ఇప్పుడు రెస్ట్ ఇచ్చి స్వదేశంలో సిరీస్‌లు ఉన్నపుడు రోహిత్, కోహ్లీలను ఆడించొచ్చు. గంభీర్‌ నిర్ణయాలు తప్పని నేను అనడం లేదు. సిరీస్‌లో ఇది ఓ వ్యూహం అయి ఉండొచ్చు’ అని నెహ్రా అన్నాడు.