టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమయ్యాడు.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అనుకున్నంత హిట్ ను అందుకోకపోయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. కాగా,నెక్స్ట్ సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని.. స్క్రిప్ట్ సెలక్షన్స్ లో కొంచెం లేటు చేశారు. రెండేళ్ల తరువాత ఆశిష్ తన తదుపరి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు..
ఈక్రమంలోనే దర్శకుడు సుకుమార్ శిష్యుడైన కాశి దర్శకత్వంలో ఓ సినిమా, అరుణ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు..ఈ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి..ఆశిష్, అరుణ్ దర్శకత్వంలో చేస్తున్న తన మూడో సినిమా టైటిల్ ని ఈరోజు అనౌన్స్ చేశారు.. ఈ సినిమా నుంచి ఒక మోషన్ పోస్టర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు..
ఈ సినిమాకి ‘లవ్ మీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ టైటిల్ కి ‘If You Dare అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ను కూడా యాడ్ చేశారు.. హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతుంది. టైటిల్ చూస్తుంటే.. ఈ సినిమాలో హీరో దెయ్యంతో ప్రేమాయణం నడపబోతున్నాడని అర్ధమవుతుంది. కొన్నిరోజుల క్రిందటే ఆశిష్ పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే.. ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్లు కొత్త పెళ్ళికొడుకు అప్పుడే దెయ్యంతో ప్రేమలో పడ్డాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.. హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు..