NTV Telugu Site icon

Asaduddin Owaisi: దేశానికి ఏం చెప్పదలచుకున్నారు.. బీజేపీ సర్కార్‌పై ఒవైసీ ఫైర్‌

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: చైనా, భారత్‌ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. దేశానికి ఏం చెప్పదలచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ సర్కార్ చైనా ముందు ఎందుకు మోకరిల్లుతోందని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపైన బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డర్‌లో ఏదైనా జరిగితే రీస్టోర్ చెయ్యాల్సిన అవసరం ఉంది.. కానీ భారత్ సర్కార్ ఏమి చేస్తుందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.

Read Also: Narendra Modi: నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు అతనే?

ఇవన్నీ ఒకవైపు సాగుతూ ఉంటే భారత ప్రధాని చైనా ప్రధానితో భేటీ అవ్వడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. గల్వాన్ లో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 19సార్లు చర్చలు జరిగాయని, ఆ చర్చల్లో ఏం జరిగిందో చెప్పాలన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లఢఖ్‌లో ఏం జరుగుతుందో చెప్పకుండా దాచిపెడుతోందని ఆయన మండిపడ్డారు. ఆర్మీని అగ్రిమెంట్‌ల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని.. అందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వహించాలన్నారు.