NTV Telugu Site icon

Asaduddin Owaisi: బీజేపీపై మండిపడ్డ అసదుద్దీన్.. ఆ ప్రమాదాలకు ప్రభుత్వం తప్పిదం..!

Asaduddin

Asaduddin

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని.. రైల్వే ఆస్తులు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. మరోవైపు.. బీజేపీ కూడా రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోందని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

Read Also: CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన

మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ‘ముఖ్యమైన ప్రశ్నలకు బీజేపీకి సమాధానాలు చెప్పనప్పుడు, పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఎవరి పేరునైనా తీసుకోవడానికి అభ్యంతరాలు నమోదు చేయడం ప్రారంభిస్తాయి. రాహుల్ గాంధీ ఐదుసార్లు ఎంపీగా ఉన్నారు. పార్లమెంటు పనితీరు ఆయనకు బాగా తెలుసు’. అని అన్నారు. మరోవైపు.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన వెనుక కారణం తనకు తెలియదని అన్నారు. కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Read Also: Water health: నీరు తగినంత తాగకపోతే వచ్చే నష్టాలివే..!