Viral News: సాధారణంగా ఆస్పత్రుల్లో వీల్ చైర్లు అనేవి ఉంటాయి. పేషెంట్స్ ను తీసుకుపోవడానికి అవి ఉపయోగపడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. అక్కడ వీల్ చైర్ కనిపించలేదు. దీంతో గాయపడిన తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని మూడో ఫ్లోర్ వరకు వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. మనోజ్ జైన్ అనే న్యాయవాది కుమారుడి కాలికి గాయం కావడంతో.. గురువారం కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. గాయానికి సంబంధించిన డాక్టర్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటాడు. అయితే తన కుమారుడిని అక్కడికి తీసుకెళ్లడానికి వీల్ చైర్ కావాలని అక్కడి సిబ్బందిని అడిగారు. వారు లేవని చెప్పడంతో.. చేసేదేమీ లేక స్కూటీపై తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Heavy Rains: భారీ వర్షాలు.. వరదలు.. సిక్కింలో 3,500 మంది పర్యాటకులను రక్షించిన సైన్యం
ఈ తతంగాన్ని చూసిన అక్కడి జనం అందరూ ఒక్కసారిగా షాక్ కి గురై నోరెళ్ల బెట్టారు. అనంతరం లిఫ్ట్ నుంచి నుంచి స్కూటర్ నడుపుతూ ఆర్థోపెడిక్ వార్డుకు కుమారుడ్ని తీసుకెళ్లాడు. డాక్టర్ కి చూపించిన అనంతరం తిరిగి వచ్చేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు. దీనిపై మనోజ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆస్పత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో సిబ్బంది అనుమతితోనే తన కుమారుడ్ని స్కూటర్ పై మూడు అంతస్తుకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అతను మండిపడ్డాడు. ఇదే విషయం.. ఆసుపత్రిలోని అవుట్ పోస్ట్ వద్ద ఉన్న పోలీసులకు ఈ వాగ్వాదం గురించి తెలిసింది.
Read Also: JD Chakravarthy: నాపై విషప్రయోగం జరిగింది.. జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్
దీంతో వారు వెంటనే మూడో అంతస్తుకు చేరుకుని.. న్యాయవాది మనోజ్ జైన్ ఏమీ అనలేకపోయారు. మరోవైపు వైద్యాధికారులు వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈ విషయంకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆస్పత్రిలో స్కూటీపై తీసుకెళ్లడమేంటనీ.. అవసరమైతే ఒకరి సాయం తీసుకోవాలి. లేదంటే తన భుజాలపైనే తీసుకెళ్లచ్చు కదా అని అంటున్నారు.