JD Chakravarthy Reveals He Got Slowly Poisoned By His Beloved Persons: జేడీ చక్రవర్తి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోగా ఓ ఊపు ఊపిన జేడీ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఎప్పుడు హుషారుగా, చురుకుగా ఉంటారు. అలాంటి జేడీపై.. విషప్రయోగం జరిగిందంటే నమ్ముతారా? అవును, స్వయంగా ఆయనే ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 8 నెలలపాటు తనపై విషప్రయోగం జరిగిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి చెడు అలవాట్లు లేని తనకు కొంతకాలం క్రితం ఉన్నట్టుండి శ్వాసకోస సమస్యలు వచ్చాయని, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టమయ్యేదని చెప్పారు. ఎంతోమంది వైద్యులకు చూపించినా ఎవరికీ అంతు చిక్కలేదని, విదేశాల్లో చెక్ చేయించుకున్నా తన సమస్యకు పరిష్కారం దొరకలేదని అన్నారు.
Perni Nani: పవన్‌కు పేర్ని నాని కౌంటర్.. ఒక చెప్పు తీసుకెళ్లి ఏం చేసుకుంటాడు?
తనకొచ్చిన సమస్య ఏంటో తెలియక డాక్టర్లు చేతులెత్తేశారని, అలాంటి సమయంలో తన స్నేహితుడైన నిర్మాత శేషురెడ్డి తనకు అండగా నిలబడ్డాడని జేడీ పేర్కొన్నారు. ఒకరోజు అతను డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లాడని.. ఆయన తనని పరీక్షించిన అనంతరం ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడని అడిగాడని చెప్పారు. డాక్టర్ ఆ మాట చెప్పగానే తాను ఖంగుతిన్నానని, అసలు తనకు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పానని తెలిపారు. అప్పుడే తనపై విషప్రయోగం జరిగిందన్న విషయం తేలిందన్నాడు. తాను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో ప్రతిరోజూ కషాయం తాగేవాడినని, ఓ వ్యక్తి తనకు ఈ కషాయం కలిపి ఇచ్చేవాడని అన్నారు. ఓసారి తనతో ఉండే నిర్మాత ఖాసీం.. తానూ ఆ కషాయం తాగుతానని అడగడంతో, ఆ కషాయం ఇచ్చానన్నారు. అది తాగిన ఖాసీంకు రెండురోజుల పాటు తీవ్ర జ్వరం వచ్చిందని, అతడు బెడ్‌పై నుంచి లేవలేకపోయాడని గుర్తు చేసుకున్నారు. ఇదే మాట తనకు కషాయాన్ని ఇచ్చే వ్యక్తి చెప్పానని.. ఆ కషాయాన్ని వేరేవాళ్లకి ఎందుకిచ్చావంటూ ఆ వ్యక్తి తనతో గొడవ పడ్డాడనని వెల్లడించాడు.
Aadhipurush : హనుమంతుని డైలాగ్స్ కు వచ్చే విమర్శలపై స్పందించిన రైటర్..!!
చివరికి.. తనకు 8 నెలలుగా స్లో పాయిజన్ ఇచ్చారని ఆసుపత్రిలో తేలిందని జేడీ వివరించారు. తాను ఏదైతే ఔషధం అనుకుని తాగానో, అదే విషంగా తేలిందని స్పష్టం చేశాడు. ఆ కషాయం వల్ల తనకు శ్వాసకోశ సమస్యలు వచ్చాయన్నారు. అయితే.. ఖాసీంకు మందు తాగే అలవాటు ఉందని, అందుకే అతని శరీరం ఆ కషాయాన్ని స్వీకరించలేకపోయిందని, దాంతో అతడు వాంతులు చేసుకున్నాడని తెలిపారు. తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారన్న విషయం తెలిసినప్పటి నుంచి, ఆ కషాయం తాగడం మానేశానన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆ విషప్రయోగం ఎవరు చేశారన్న విషయాన్ని మాత్రం జేడీ చక్రవర్తి బయటపెట్టలేదు.