సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది. ఆయన్ను విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ తొలగించింది. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి సంబంధించిన కేసు కారణంగా బిభవ్‌కుమార్‌ను డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ తొలగించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిభవ్ కుమార్‌ను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అతనితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను కూడా వేర్వేరుగా ఈడీ విచారించింది.
ఇది కూడా చదవండి: Sanju Samson: ఓటమి తర్వాత.. అందుకు కారణాలు చెప్పడం చాలా కష్టం: సంజూ
2011లో అవినీతికి వ్యతికేరంగా చేపట్టిన ఉద్యమం నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో బిభవ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. యూపీఏ హయాంలో వెలుగులోకి వచ్చిన అవినీతి కుంభకోణాలపై బిభవ్ పోరాటం చేశారు. అనంతరం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. పర్సనల్ సెక్రటరీగా బిభివ్‌ను కేజ్రీవాల్ నియమించకున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. మార్చి 21న ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Chandrababu and Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం.. నేడు అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
అనంతరం ఈడీ అరెస్ట్‌పై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సుప్రీంకోర్టు కూడా విచారణకు మరొక తేదీని ఇస్తామని పెండింగ్‌లో పెట్టింది.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ సైన్యం దురాగతాలు.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి..!
ఇక బుధవారం సునీతా కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్, ఆప్ సభ్యులు సందీప్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్‌లతో సహా ప్రముఖ ఆప్ నేతలు కలిశారు. నియంత ప్రభుత్వం యొక్క అన్ని దురాగతాలను భరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని సునీతా కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించారు.
ఇది కూడా చదవండి: Summer Tips : వేసవిలో ఈ పానీయాలను తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..