Sanju Samson on Rajasthan Royals Defeat vs Gujarat Titans: కెప్టెన్స్ కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే.. ఓటమి తర్వాత అందుకు గల కారణాలు చెప్పడమే అని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై చివరి బంతి కారణంగానే ఓటమిపాలయ్యాం అని నవ్వుతూ తెలిపాడు. ఈ ఓటమి నుంచి తాము గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం అని సంజూ చెప్పాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్ కారణంగా రాయల్స్ ఓడిపోవాల్సి వచ్చింది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ మాట్లాడుతూ… ‘చివరి బంతి కారణంగానే మేం ఓటమిపాలయ్యాం. ప్రస్తుతం మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది. టోర్నమెంట్‌లో కెప్టెన్లంతా కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే.. అది ఓటమి తర్వాత కారణాలు చెప్పడమే. అది చాలా కష్టంగా ఉంటుంది. భావోద్వేగాలు తగ్గాక ఓటమి గురించి స్పష్టంగా చెప్పగలను. గుజరాత్ టైటాన్స్‌కు గెలుపు క్రెడిట్ ఇవ్వాలి. అద్భుతంగా ఆడారు’ అని అన్నాడు.
Also Read: Pawan Kalyan-Navdeep: పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్
‘ఈ ఓటమి నుంచి మేం గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు 180 పరుగులు చేస్తే.. మంచి లక్ష్యమని భావించాను. మేం 196 స్కోరు చేశాం కాబట్టి.. విజయంపై నమ్మకంగా ఉన్నాము. మంచి లేకుండా స్లోగా ఉన్న ఈ పిచ్‌పై ఈ లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. మేం డిఫెండ్ చేసుకోవాల్సింది. కానీ గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మా ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్ చాలా కష్టంగా అనిపించింది. అయినా మేం 196 పరుగులు చేశాం. 197 పరుగులను కాపాడుకోవాల్సిన స్కోర్’ అని సంజూ శాంసన్ చెప్పాడు.