Site icon NTV Telugu

Swati Maliwal Case: కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్

Bibava Kumar Arrest

Bibava Kumar Arrest

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై భౌతికదాడిలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శ బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో శనివారం అతన్ని అరెస్ట్ చేశారు. సోమవారం (13-05-2024) కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేశారు. నాలుగు రోజుల తర్వాత అనగా.. గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: TeamIndia: ఆ రోజునే న్యూయార్క్ బయలుదేరునున్న టీమిండియా ఆటగాళ్లు..

బిభవ్ కుమార్‌ను ముఖ్యమంత్రి నివాసం నుంచి ఢిల్లీ పోలీస్ బృందం మధ్యాహ్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విచారణ నిమిత్తం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి సహకారం అందిస్తామని అధికారులకు ఈ మెయిల్ పంపినప్పటికీ పోలీసుల నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది కరణ్ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి: Police Station Fire: మైనర్ భార్య, భర్త పోలీస్ కస్టడీలో మృతి.. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పుపెట్టిన జనం..

సోమవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మాలివాల్… సీఎం నివాసానికి వచ్చింది. సిబ్బంది డ్రాయింగ్ రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పడంతో కేజ్రీవాల్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఆకస్మాత్తుగా బిభవ్ కుమార్‌ రావడం.. పెద్దగా అరుపులు అరవడం.. దుర్భాషలాడారు. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. అంతే మెరుపు వేగంతో స్వాతి మాలివాల్‌పై దాడికి తెగబడ్డారు. తను రుతుక్రమంలో ఉన్నానని బతిమాలినా పట్టించుకోకుండా దాడి చేశాడు. సాయం చేయమని వేడుకున్నా.. సిబ్బంది చూస్తూనే ఉన్నారు కానీ.. ఎవరు రక్షించే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి ఎలాగోలా బయటపడి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపే స్వాతి మాలివాల్‌ను సిబ్బంది బయటకు పంపేశారు. తాజాగా విడుదలైన వీడియోలో ఈ దృశ్యాలు కనిపించాయి.

స్వాతి మాలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో బిభవ్ కుమార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎక్కడెక్కడ దాడి చేశాడో అవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే మెడికల్ రిపోర్టులో కూడా ఆమెపై దాడి జరిగినట్లుగా తేలింది. శనివారం మధ్యాహ్నం బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు విచారించనున్నారు. ఇక జాతీయ మహిళా కమిషన్ రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ బిభవ్ కుమార్ స్పందించలేదు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD : బుజ్జికి వాయిస్ ఓవర్ అందించిన ఆ స్టార్ హీరోయిన్..?

మరోవైపు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కేజ్రీవాల్ స్పందించకపోవడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

Exit mobile version